Breaking: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

0
72

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోయినసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయవంతం అయ్యాం. ఏకంగా 88 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముందస్తు ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మధ్యలోనే ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే మా ప్రభుత్వమే రావాలి. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాం. ఇప్పుడు అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 95 నుండి 105 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.