Breaking: సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..ఏం చెప్పబోతున్నారు?

0
89

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక తాజాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రెస్ మీట్ లో గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అలాగే వర్షాకాలం సమీపించడంతో రైతులకు ఏదైనా శుభవార్త చెప్పనున్నారా? లేక బీజేపీ విజయ సంకల్ప సభను ఉద్దేశించి కేసీఆర్ ఏదైనా మాట్లాడనున్నారో చూడాలి.