Breaking: ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
83

విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో మోడీ రెండు రోజులు ఉండబోతున్నారు.

ఆయన ఎప్పుడు విపక్షాలపై గొంతు చించుకొని మాట్లాడుతారు. మేమే శాశ్వతం అనే భ్రమలో ప్రధాని ఉన్నారు. ఆయన కంటే ముందే ఎందరో ప్రధానులు ఉన్నారు. దేశంలో రాజకీయ మార్పు తప్పనిసరి. ఎవరు శాశ్వతం కాదు. శ్రీలంకకు వెళ్లి మీరు ప్రధానిగా వ్యవహరించలేరు. మీ కారణంగా శ్రీలంక పౌరులు రోడ్డు ఎక్కారు. దేశం తలదించుకోవాల్సి వస్తుంది. మీ ఒంట్లో ప్రవహించే రక్తంలో కొంచెమైన నీతి ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

మీరు మౌనంగా ఉంటారేమో మేము ఉండం. ఉద్యమం చేస్తాం. ఇంతకుముందు ఏ ప్రధానిపై ఇలాంటి ఆరోపణలు లేవు. శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే మిమ్మల్ని దోషిగా వ్యవహరిస్తాం. వ్యక్తిగతంగా మోడీతో నాకు ఎటువంటి తగాదాలు లేవు. మీరు నిజాయితీపరులైతే శ్రీలంక విషయంపై హైదరాబాద్ వేదికగా వెల్లడించాలన్నారు.