తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని, అయితే ఇది కేవలం ఎస్సి, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కాగా కొన్నిరోజులుగా తమకు కటాఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.