Flash: సీఎం కీలక నిర్ణయం..3 రోజులు స్కూళ్లు బంద్

0
81

కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదం ముదురుతోంది. నేడు కర్ణాటక హైకోర్ట్ ముందుకు ఈ వివాదం చేరింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఉడిపి, చిక్ మంగళూర్, బెళగావి తదితర జిల్లాల్లో ఈ వివాదం సాగుతోంది. మెల్లిమెల్లిగా ఇతర జిల్లాలకు కూడా పాకుతోంది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించి రాగా.. మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలతో తరగతులకు హాజరు అవుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈరోజు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్ర బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.