నరసాపురంలో సీఎం కొత్త స్టెప్

నరసాపురంలో సీఎం కొత్త స్టెప్

0
83

నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీని కాదు అని మరో వర్గాన్ని హైలెట్ చేస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇలాంటి ప్రయోగాలు పార్టీ చేయడం లేదు అని అంటుంటే రాజకీయంగా వెనుక జరుగుతోంది అదే అని మరో వర్గం చెబుతోంది.

వైసీపీలో చేరిన గంగరాజు కుటుంబ సభ్యులను అడ్డంపెట్టుకుని రఘురామ కృష్ణంరాజుని కట్టడిచేయాలని భావిస్తున్నారన్నది వైసీపీ వర్గాల టాక్. అయితే గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా రఘురామ కృష్ణంరాజుకి చెక్ పెట్టడం సాధ్యమేనా అన్న ప్రశ్న కేడర్ లో వస్తోంది. రాజకీయంగా పదవిలో లేకపోయినా ఆ సెగ్మెంట్లో గత 20 ఏళ్లుగా రఘురామ కృష్ణంరాజుకి మంచి పేరు ఉంది. అదే ఈసారి సీటు పొందండంతో వైసీపీకి బలంగా ఆయనకు గెలుపుని తెచ్చింది.

పైగా సినిమా సెలబ్రెటీ నాగబాబు, ప్రపంచ సెలబ్రెటీ పాల్ ని కాదు అని ఇక్కడ జనాలు ఆయనని గెలిపించారు. మాజీ ఎంపీ గంగరాజు పెద్దకుమారుడు రంగరాజుకు జగన్కు మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో రంగరాజుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాని అక్కడ ఎంపీని కాదు అని జగన్ ఆ స్టెప్ వేయరు అని మరో వర్గం చెబుతోంది.