బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి అంటే తెలియని వారు ఉండరు… ఆమె యూపికి ముఖ్యమంత్రిగా పని చేశారు, అయితే ఆమె పార్టీ ప్రస్తుతం అనుకున్నంత రాజకీయాల్లో దూసుకువెళ్లలేకపోతోంది, అయితే తాజాగా ఆమె ఇంటికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.
కొద్దికాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించనందుకు గ్రేటర్ నొయిడాలోని ఆమె నివాసానికి కరెంట్ సరఫరాను కట్ చేశారు. మాయావతి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.67 వేల వరకు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు.
అయితే వెంటనే నగదు చెల్లిస్తే మళ్లీ విద్యుత్ సరఫరా ఇస్తాం అని చెబుతున్నారు, అయితే ఆమె ఇంటికి ఇలా కరెంట్ కట్ చేయడం పట్ల చాలా మంది పార్టీ నేతలు విమర్శలు చేశారు… కాని దీనిపై ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు అని చెప్పారు అధికారులు.. చివరకు బిల్లు కట్టడంతో వెంటనే కరెంట్ ఇచ్చారట అధికారులు.