సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
84

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ కూడా జగన్ తో సత్సంబంధాలు బాగానే కలిగి ఉన్నారు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే పలుసార్లు సమావేశమయ్యారు, అయితే గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ , చంద్రబాబు మధ్య రాజకీయ వైరాలు ఉన్న సంగతి తెలిసిందే. కాని జగన్ తో మాత్రం ఆ ఇబ్బంది లేదు కేసీఆర్ కి.

దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని కామెంట్లు చేశారు… ఏపీ సీఎం జగన్ తో తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉన్నాం కనుకనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని మంత్రి కేటీఆర్ అన్నారు.

చంద్రబాబు హయాంలో కూడా ఏపీతో సత్సంబంధాలు కొనసాగాయని గుర్తుచేసుకున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉమ్మడి ప్రాజెక్టును పక్కన పెట్టలేదని, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టామని రెండు రాష్ట్రాల సీఎంలు ప్రకటించలేదని చెప్పారు.

ఇక ముఖ్యమంత్రి పదవి గురించి ఆయనని ప్రశ్నిస్తే దానిపై ఆయన సమాధానం చెప్పారు. కేసీఆరే తమ సీఎం అని, ఈ విషయమై అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారని, దీనిపై ఇంకా అనుమానం ఎందుకు? అని ప్రశ్నించారు.. మొత్తానికి వచ్చే ఎన్నికల సమయంలోపు మంత్రి కేటీఆర్ ని సీఎం చేస్తారు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వేళ, తాజాగా ఆయన ఈ ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్పారు.