ఈ వైరస్ కాలంలో వైద్యులు చేస్తున్న సేవలు ఎవరూ మరువలేనివి, నిత్యం ఆస్పత్రికి వచ్చి ఎలాంటి లీవ్ తీసుకోకుండా ఉద్యోగం చేస్తున్నారు, వైద్యులు నర్సులు చేసే సేవ వెలకట్టలేనిది, ఈ సమయంలో వారికి ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తే పూలతో స్వాగతం పలుకుతున్నారు.
అయితే ఓ నర్సుకి ఇప్పుడు గర్భిణీ 9వ నెల, అయినా సరే ఆమె రోగులకి సేవ చేస్తోంది, నిత్యం ఆస్పత్రికి వచ్చి సర్వీస్ చేస్తోంది, ఆమె తీర్థహల్లి తాలూకాలోని గజనూర్ గ్రామానికి చెందిన రూపా పర్వీన్ రావు .. జయచామ రాజేంద్ర గవర్నమెంట్ ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తోంది, ఆమెని అక్కడ సీనియర్లు అలాగే డాక్టర్లు అందరూ కూడా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని సెలవు పెట్టుకోమని చెబుతున్నారు.
కాని ఆమె మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని , రోజూ రోగులు ఎక్కువ మంది వస్తున్నారు, నా డ్యూటీ నేను చేస్తాను అని చెబుతోంది , దీంతో ఆమెని అందరూ ప్రశంసిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నేను సేవ చేయాలని నిర్ణయించుకున్నా అని చెబుతున్నారు. అంతేకాదు సీఎం యడ్యురప్ప ఆమెకి ఫోన్ చేసి ప్రశంసించారట.