సీఎం జగన్ ఇంటికి సీఎం రమేష్

సీఎం జగన్ ఇంటికి సీఎం రమేష్

0
95

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలిశారు.. తన కుమారుడు వివాహ శుభలేఖను జగన్ కు అందించారు… ఫిబ్రవరి 7న తన కుమారుడు రిత్విక్ వివాహానికి కచ్చితంగా రావాలని చెప్పారు సీఎం రమేష్… జగన్ కూడా సాను కూలంగా స్పందించారు…

ప్రస్తుతం సీఎం రమేష్ కుమారుడు వివాహ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఇటీవలే ప్రధాని మోడీకి కూడా వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు.. తాజాగా ఏపీ సీఎంకు ఇచ్చారు.. ఇటీవలే దుబాయ్ లో రిత్విక్ కు పూజతో నిర్చితార్థం అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే…

ఈ నిర్చితార్థానికి జాతీయ నాయకులు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.. వారికోసం ప్రత్యేక విమానాలనుకూడా ఏర్పాటు చేశారు… కాగా ఇటీవలే రమేష్ టీడీపీకి గుడ్ బైచెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే…