Breaking News- మూడు రాజధానులపై సీఎం సంచలన నిర్ణయం

The AP government has taken a key decision to withdraw the Three Capitals Act

0
75

మూడు రాజధానులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు వైకాపా ప్రభుత్వం తెలిపిందని..ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు.

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్​ ప్రకటన చేయనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ నివేదించారు. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు త్రిసభ్య ధర్మాసనం వాయిదా వేసింది.