సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం – ప్రజలు సంతోషం

CM Stalin made another crucial decision

0
116

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధ‌ర‌లు ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సెంచరీ దాటేసింది పెట్రోల్ ధర . దీంతో బండి బయటకు తీయాలి అంటే జంకే పరిస్దితి. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు ఇప్పుడు ప్రజలకు పెను భారం అవుతున్నాయి.

ఇక రాష్ట్రాలు అయినా రేట్లు తగ్గిస్తే బాగుండు అని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి వేళ కొత్తగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న సీఎం స్టాలిన్ తమిళనాడులో అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలకు ఎన్నో గొప్ప పథకాలు తీసుకువస్తున్నారు. తాజాగా పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును రూ. 3 మేర తగ్గించారు. అయితే, డీజిల్ పై మాత్రం ఎలాంటి ఊరట ఇవ్వలేదు పెట్రోల్ కు మాత్రమే ఈ తగ్గింపు.

దీని వల్ల ఖజానాపై 1,160 కోట్ల మేర భారం పడనుంది. తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102గా ఉండగా.లీటర్ డీజిల్ ధర రూ. 94.39గా ఉంది. రేపటి నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి. సీఎం తీసుకున్న నిర్ణయం పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.