సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కు గుడి ఎక్క‌డ క‌డుతున్నారంటే ?

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కు గుడి ఎక్క‌డ క‌డుతున్నారంటే ?

0
81

సినిమా తార‌ల‌కు రాజ‌కీయ నేత‌ల‌కు గుడి క‌ట్ట‌డం చూశాము, ఇక క‌న్న కొడుకులు త‌ల్లి దండ్రుల‌పై ప్రేమ చూపించి వారికి కూడా గుడి క‌ట్ట‌డం చూశాం ,తమ గురువుల‌కి గుడి క‌ట్టిన స్టూడెంట్స్ ని చూశాం, మ‌న దేశంలో ఇలాంటి గుడులు చాలా మందికి ఉన్నాయి.

అయితే తాజాగా మ‌న ఏపీలో కూడా ఇలా ఓ గుడి క‌డుతున్నారు ఎవ‌రికో తెలుసా.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి…పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెం వైకాపా నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరిట ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా గుర్తుండి పోయేవిధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని వైసీపీ నేత కురకూరి నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు అంద‌రికి చేరుతున్నాయి, ఏపీ బాగుండాల‌ని ఇలా గుడి క‌డుతున్నాము అని తెలిపారు.