విశాఖలో మంత్రుల నిద్రవెనుక సీఎం జగన్ మాస్టర్ ప్లాన్…

విశాఖలో మంత్రుల నిద్రవెనుక సీఎం జగన్ మాస్టర్ ప్లాన్...

0
83

ప్రస్తుత సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అవకాశంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఎల్జీ పాలిమర్స్ లో విష వాయువులు వెలవడిన తర్వాత విశాఖలో సాధారణ పరిస్థితిలను తీసుకుని రావడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది…

ప్రజాల్లో నెలకొన్న భయాందోళనను తొలగించడానికి స్వయంగా మంత్రులు అధికారులు ఎంపీ ఎమ్మెల్యేలు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో నిద్రించారు… ప్రజలకు అండగా తాము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చారు. గ్యాస్ ప్రభావం లేదని ధైర్యాన్ని నిప్పే ప్రయత్నం చేశారు…

అయితే మంత్రులతో పాటు ఇక సీఎం జగన్ కూడా విశాఖ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది… ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి…ప్రజలకు భరోసా కల్పించేందు జగన్ కొన్నిరోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని చూస్తున్నరట… అయితే ఇది తాత్కాలికమే అని కొందరు అధికారులు చర్చించుకుంటున్నారు…