కలెక్టర్ గా 8వ తరగతి విద్యార్ధిని ఎందుకు చేశారో తప్పక తెలుసుకోండి

కలెక్టర్ గా 8వ తరగతి విద్యార్ధిని ఎందుకు చేశారో తప్పక తెలుసుకోండి

0
103

చిన్నతనం నుంచి సరైన క్రమంలో చదువుకుంటే విద్యార్దులు బాగా చదివితే కలెక్టర్లు డాక్టర్లు లాయర్లు అయ్యే అవకాశం ఉంటుంది..చిన్న తనం నుంచే చదువు విలువ తెలిస్తే పెద్దయ్యే సరికి మంచి ఉన్నత స్ధానంలో వారు ఉంటారు. వారిని సంస్కారం నేర్పుతుంది

తాజాగా ఓ కలెక్టర్ చేసే పనికి అందరూ షాక్ అవుతున్నారు ఆమె మహిళల్లో ముఖ్యంగా విద్యార్దుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 8వ తరగతి చదువుతున్న స్కూల్ విద్యార్థిని కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది, ఇలా ఆమె బాధ్యతలు స్వీకరించడానికి కారణం అక్కడ జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర.

అయితే దీనికి కారణం కూడా ఉంది.మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమెకు ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు, అంతేకాదు వరుసగా అందరికి అవకాశం కల్పిస్తామని మంచిగా చదువుకోవాలి అని ఆమె తెలిపారు.ఆమె ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది, ఆమె చేసిన పనికి అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు..మహిళల్లో వారి శక్తిని తెలియచేస్తున్నారు బాగా చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు ఆమె తెలుపుతున్నారు..