మొత్తానికి వచ్చే నెల నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి, అలాగే జూన్ 12 న స్టార్ట్ అవ్వాల్సిన స్కూళ్లు మూడు నెలలు ఆలస్యంగా తెరవనున్నారు ఈ కోవిడ్ కారణంగా , అయితే ఇప్పుడు కాలేజీల విషయం చూస్తే ఏపీలో అక్టోబర్ 15వ తేదీ నుంచి కాలేజీలు తెరుచుకోనున్నాయి.
మార్చి మూడో వారంలో విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అప్పటి నుంచి స్కూల్లు కాలేజీలు పరీక్షలు ఏమీ జరగలేదు, నేరుగా తర్వాత తరగతులకి ప్రమోట్ చేశారు, అయితే తాజాగా కాలేజీలు స్కూళ్లు ఓపెన్ చేసే డేట్ ప్రకటించారు.
అన్ని ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు సీఎం జగన్ . ఇక యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపడుతామని సీఎం జగన్ ప్రకటించారు.