రాజధానిపై మళ్లీ రగడ స్టార్ట్

రాజధానిపై మళ్లీ రగడ స్టార్ట్

0
87

ఏపీ రాజధానిపై మళ్లీ రగడ స్టార్ అయింది… తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను నిన్నటి పరిస్థితి దృష్ట్యా శాసనమండలిలో రాజధాని అమరావతిపై అలా జవాబు చెప్పాల్సి వచ్చిందని అన్నారు…

కమిటీ నిర్ణయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు… ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి… తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాన సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ…. అసత్య ప్రచారాలకు శాససభను వేదికగా చేసుకోవడం బాధాకరమని అన్నారు…

రాజధానికి అడ్డుపడుతూ వైసీపీ నేతలు చరిత్ర తప్పిదం చేస్తున్నారని ద్వజమెత్తారు… రాజధాని లేకుండా రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు… రాజధాని ఉంటేని రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అనగాని అన్నారు…. ప్రతీకారంపై చూపిస్తున్న శ్రద్ద పాలనపై చూపాలని అన్నారు…