‘టిఆర్ఎస్ లో కలకలం..ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు’

0
69

తెలంగాణాలో రాజకీయం రోజుకో రంగు పులుముకుంటుంది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కారు దిగి అటు కమలం వైపు ఇటు హస్తం పార్టీలో చేరారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక వరుస వలసలతో గులాబీ బాస్ గుండెల్లో గుబులు పుట్టింది.

ఇక తాజాగా ఖమ్మం టిఆర్ఎస్ సీనియర్ నేత  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చని తుమ్మల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీ వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.