మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Complaint of Congress leaders against former Collector Venkatramireddy

0
108

మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్ట్ ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ పేర్కొంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఫిర్యాదు అందజేసిన వారిలో ఉన్నారు.