దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పలు ఆంక్షలను విధించాయి. కరోనా, ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో కేరళ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, రాష్ట్రం నుంచి కేరళ వెళ్లే వాహనాలు సరిహద్దు ప్రాంతాల్లోనే నిలిచి పోయాయి. పాలు, వైద్యసామగ్రి తదితర అత్య వసర వాహనాలను మాత్రమే అనుమతించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కన్నియాకుమారి జిల్లా కళియకోయిల్ చెక్‌పోస్ట్ వద్ద రాష్ట్ర పోలీసులు గస్తీ నిర్వహించి అత్యవసర, విమానాశ్ర యాలకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించారు.
Flash: సంపూర్ణ లాక్ డౌన్..ఆ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం
Complete lock down in Kerala..Government sensational decision