కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం పార్టీ సామాజిక మాధ్యమ విభాగంలో 55 మంది ఉద్యోగులకు గాను 20మంది రాజీనామా చేయగా మిగిలిన 35 మందికి కూడా సరిగా జీతాలు ఇవ్వట్లేదు.
ఇప్పటికే కాంగ్రెస్ సేవాదళ్ నెలసరి బడ్జెట్‌ను రెండున్నర లక్షల నుంచి రెండు లక్షల రూపాయలకు తగ్గించిన ఆ పార్టీ అధిష్ఠానం, ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ, మహిళా విభాగాలకు కూడా ఖర్చు తగ్గించుకోమని సూచించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితులన్నీ పార్టీ ఆర్థిక ఇబ్బందులను చెప్పకనే చెబుతున్నాయని తెలుస్తోంది.