మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్థిని నేడు ఏఐసీసీ ప్రకటించింది. టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు ప్రయత్నించినా చివరకు పాల్వాయి గోవర్ధన్ కూతురు స్రవంతి రెడ్డిని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా టికెట్ ఆశించి భంగపడ్డ కృష్ణారెడ్డితో పాటు స్రవంతితో టీపీసీసీ చీఫ్ రేవంత్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్బంగా బైపోల్ అభ్యర్థి స్రవంతి మాట్లాడుతూ.. నాకు అవకాశం ఇచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కూడా పిలుపునిస్తున్నాను. ఏది ఏమైనా కచ్చితంగా శక్తి వంచన లేకుండా పనిచేద్దాం. అభివృద్ధి చేసింది కాంగ్రెస్ కావున ఓటు అడిగే హక్కు మనకు ఉందన్నారు.
మరోవైపు రేపటి నుంచి కాంగ్రెస్ నేతలు మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు , బలరాం నాయక్ , దామోదర్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్ యాదవ్ ,సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, చెరకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.