కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ బిగ్ ప్లాన్

కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ బిగ్ ప్లాన్

0
83

తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత తొలిసారి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు…. ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా కేసీఆర్ బంపర్ మెజార్టీ సాధించి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా ఎదుగారు…

అంతటి బాడా నేతలను ఢీ కొట్టాలంగే అంత ఈజీ కాదని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్… ఆయనకు సరిపడ వాక్చాతుర్యం కలిగిన నేతను ఎంపిక చేసి తెలంగాణ పగ్గాలను అప్పగించేందుకు చూస్తోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్…

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాలనుంచి ఎఐసీపీ కార్యదర్శిగా ఉన్న కుంతియను తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నిలబెట్టాలని చూస్తోంది… ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ రాజీవ్ శంకర్ అసోం కు చెందిన గౌరవ్ గగోయ్ లేదా మరో సీనియర్ నేత ఆర్పీఎస్ సింగ్ పేర్లను పరిశీలిస్తోందట… వీరిలో ఎవరో ఒకరు బాధ్యతలను తీసుకున్న తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షడిని ఎంపిక కసరత్తు జరుగుతుందని అంచనా వేస్తున్నారు..