తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ.. రేవంత్ రెడ్డి చుట్టు ఆ పార్టీకి చెందిన నేతలు ఉచ్చుబిగిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు మేధావులు… గత కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు కొనసాగుతోంది.
యురేనియం వ్యతిరేకత కాటి నుంచి నేటి అసెంబ్లీ సమావేశాల వరకు ఆ పార్టీ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ సంచలనంగా మారుతున్నారు. ఇక ఇదే క్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభలో చేసిన ప్రసంగాలతో పార్టీ గ్రాఫ్ పెరగ్గా మూడోరోజు రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ కు ఉన్న గ్రాఫ్ కూడా పడిపోయిందని కోదండరెడ్డి వ్యాఖ్యనించారు . మరి ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.