Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ డీలా

0
78

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాలకు గత నెల 10 నుంచి ఈ నెల 7 వరకు వివిధ విడతల్లో పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఓటింగ్‌ను నిర్వహించారు. మణిపుర్​లో రెండు దశల్లో పోలింగ్​ జరగగా.. పంజాబ్​, ఉత్తరాఖండ్​, గోవాలో ఒకే దశలో పోలింగ్​ పూర్తయింది.

ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్​లోనూ చేతులెత్తేసింది కాంగ్రెస్. అక్కడ ఆమ్​ఆద్మీ పార్టీ 80 స్థానాలకుపైగా ఆధిక్యంతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్​ 12 చోట్ల మాత్రమే లీడింగ్​లో ఉంది. అలాగే ఉత్తర్​ప్రదేశ్​ మరీ ఘోరంగా 4 స్థానాల్లో లీడ్​తో.. సింగిల్​ డిజిట్​లోనే ఉంది.

ఉత్తరాఖండ్​లో 23 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. మేజిక్​ ఫిగర్​ను అందుకోవాలంటే 36 చోట్ల నెగ్గాల్సి ఉంటుంది. గోవాలో హంగ్​ దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి. భాజపాతో కాంగ్రెస్​ హోరాహోరీగా పోటీపడుతుంది. కనీస మెజార్టీకి 21 స్థానాలు అవసరం కాగా.. భాజపా 18, కాంగ్రెస్​ కూటమి 14 చోట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నాయి. మణిపుర్​లోనూ భాజపా ఆధిక్యంలో మేజిక్​ ఫిగర్​కు దగ్గర్లో ఉంది. కాంగ్రెస్​ కూటమి 13 చోట్లకుపైగా ఆధిక్యంలో ఉంది.