మ‌రియ‌మ్మ లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపాలి

0
116

దళిత మహిళ మరియమ్మ మృతిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రీతం ఇవాళ డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

మరియమ్మ లాకప్ డెత్ దారుణం అని నేతలు ఆరోపించారు. మరియమ్మ మృతి ఘటనతోపాటు రాష్ట్రంలో దళితలు, గిరిజనులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెరుగుతున్న దాడులను డిజిపికి ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.