గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా అక్కడ ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జగదీష్ ఠాకూర్ ను నియమించారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ అమిత్ చౌదాను తొలగించి..ఆయన స్థానంలో జగదీష్ ఠాకూర్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.