కాంగ్రెస్ కు బిగ్ షాకివ్వనున్న కేటీఆర్

కాంగ్రెస్ కు బిగ్ షాకివ్వనున్న కేటీఆర్

0
111
KTR

తెలంగాణలో మున్సిపలక ఎన్నికలకు రంగం సిద్దం అయింది.. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారుకు భారీ మెజార్టీ రావడం తెలిసిందే.. అయితే మున్సిపోల్ కూడా కచ్చితంగా టీఆర్ఎస్ నేతలు మెజార్టీ స్దానాలు గెలుస్తాం అని చెబుతున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అయితే ఎమ్మెల్యేలు అందరూ ఎక్కువగా సీఎం కేసీఆర్ కాకుండా మంత్రి కేటీఆర్ చుట్టు తిరుగుతున్నారు అని తెలుస్తోంది.

దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు అందరూ కూడా చినబాబు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు ఎక్కువగా చూస్తున్నారట .. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం క్యూ కట్టారు.

మొత్తానికి మున్సిపోల్ లో టీఆర్ ఎస్ జెండా ఎగురవేసేందుకు కేటీఆర్ కూడా సరికొత్త టీమ్ తో జిల్లాలలో దూసుకుపోయేలా చూస్తున్నారు.. యువ నేతలను అలాగే పార్టీ సీనియర్లను కలుపుకుపోతున్నారు.. మొత్తానికి కేటీఆర్ ఈ సారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పోల్ ల కూడా షాక్ ఇస్తారు అని అంటున్నారు, ఎందుకంటే ఆయన చేతిలోనే మున్సిపల్ శాఖ ఉంది అందుకే టీఆర్ ఎస్ కూడా సరికొత్త ప్లాన్స్ వేస్తోంది.