కేటీఆర్ తో ఉత్తమ్ బ్రదర్ కౌశిక్ రెడ్డి భేటీ, తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

0
110

బిగ్ బ్రేకింగ్…! ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయం అనుకుంటున్న తరుణంలో ఓ కీలక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ యువనేత, మంత్రి కేటీఆర్ తో, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి భేటీ అయ్యారు. ఐతే ఏంటీ… కౌశిక్ రెడ్డి భేటీ కూడా బ్రేకింగేనా అంటారా!? కచ్చితంగా బ్రేకింగే… ఎందుకంటే కౌశిక్ రెడ్డి కేవలం కాంగ్రెస్ నేత మాత్రమే కాదు. హుజూరాబాద్ అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఈటెల రాజేందర్ పై పోటీ చేశారు. అంతే కాదు, ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయానా కజిన్ బ్రదర్. చాలా కాలంగా ఉత్తమ్ కు మంచి చెడుల్లో చేదోడు వాదోడుగా ఉంటోన్న నేత. అలాంటి కౌశిక్ ఇప్పుడు సడెన్ గా కేటీఆర్ తో భేటీ కావడం టీ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

కేటీఆర్, కౌశిక్ ఓ ప్రైవేటు ఫంక్షన్ లో కలుసుకున్నారు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ పై చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. ఆ తర్వాత కొద్ది సేపు ప్రైవేటుగా మాట్లాడుకున్నారు. చివరగా కేటీఆర్ ను కారు ఎక్కిస్తూ డోర్ దగ్గర నిలబడి కొద్ది సేపు ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. కేటీఆర్ తో కౌశిక్ ప్రదర్శించిన సాన్నిహిత్యం చూసి టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందా అని ముక్కునవేలేసుకుంటున్నారు.

హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఈటెలకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కౌశిక్ పేరు కూడా వినిపిస్తోంది. ఉత్తమ్ కు అత్యంత సన్నిహితుడే కాక బంధువు కూడా అయిన కౌశిక్ ఆయన మాట కాదని ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లోకి వెళ్లరని టీ కాంగ్రెస్ వర్గాలు ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాయి. సడెన్ గా కేటీఆర్ తో కౌశిక్ భేటీ కావడంతో వాళ్ల అంచనాలు తల్లికిందులైనట్టేనా అన్న చర్చ మొదలైంది. ఉత్తమ్ కు చెప్పకుండా కౌశిక్ ఏమీ చేయరన్న అభిప్రాయం కూడా ఉంది. కేటీఆర్ తో భేటీ వ్యవహారం ఉత్తమ్ కు తెలియకుండానే జరిగిందా… లేక ఆయనకు ముందస్తు సమాచారం ఉందా అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు గాంధీ భవన్లో వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో కేటీఆర్, కౌశిక్ భేటీ హాట్ హాట్ గా మారింది. కౌశిక్ కాంగ్రెస్ లోనే ఉంటారా… లేక గులాబీ తీర్థం పుచ్చుకుంటారా… అన్నను కాదంటారా… లేక అంతర్గతంగా అన్న ఆశీస్సులతోనే కారెక్కేస్తారా… ఉత్తమ్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే ఈ మీటింగ్ పై ఆయన రియాక్షన్ ఏంటీ… సొంత తమ్ముడి పై పీసీసీ చీఫ్ గా ఆయన క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తారా? ఇవన్నీ ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్సే! హుజూరాబాద్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన మీట్ ఇదే…