బాంబే హైకోర్టుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

Congress leader Rahul Gandhi to the Bombay High Court

0
95

పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల ఒప్పందంపై 2018లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘కమాండర్‌ ఇన్‌ థీఫ్‌’ వ్యాఖ్యలపై బీజేపీ మద్దతుదారుడు శ్రీమల్‌ ముంబయి కోర్టులో పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు మేజిస్ట్రేట్‌ కోర్టు 2019లో రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాహుల్‌ గాంధీ కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాలేదు. ప్రస్తుతం పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాది కుశాల్‌ మోర్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు దారుడు బాధితపక్షం పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, రాహుల్‌ ప్రకటన ప్రధాని మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని శ్రీమల్‌ పేర్కొన్నారు. అయితే, పిటిషన్‌పై విచారణను ఈ నెల 22వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.