రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ కు మెయిన్ రీజన్ ఇదే

రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ కు మెయిన్ రీజన్ ఇదే

0
93

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో ఒక్కసారిగా అక్కడి సీన్ మారిపోయింది… అంతకుముందే హైకమాండ్ పెద్దలకు సచిన్ పైలట్ తన వాదనని వినిపించినా పట్టించుకోకపోవడంతో ముసలం తప్పలేదు… దూతల ద్వారా సోనియా రాహుల్ కు పైలట్ సమాచారం పంపించినా అటు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీ వీడేందుకు సిద్దపడకతప్పలేదు…

రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం రేసులో ముందువరుసలో ఉన్నది సచిన్ పైలట్ మాత్రమే కానీ సోనియా గాంధీ మాత్రం సీనియర్లకు పదవి ఇవ్వాలని భావించి అశోక్ గెహ్లట్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది… అప్పటి నుంచి సచిన్ పైలట్ రగలిపోతున్న విషయం తెలిసిందే…

ఈ క్రమంలో సోనియా రాహుల్ గాంధీ దూతలు సచిన్ పైలట్ తో మంతనాలు జరపగా ఆయన మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుపట్టినట్లు తెలుస్తోంది… హైకమాండ్ మాత్రం అతని డిమాండ్ ను అంగీకరించకుండా సీఎం పదవికి అనుభవం కావాలి ఇంకా రాలేదని చెప్పడంతో వార్ మొదలైంది… రాజస్థాన్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే హస్తిన నిర్లక్ష్యంతో ఆ రాష్ట్రం కూడా కాంగ్రెస్ నుంచి చేజారడం ఖాయంగానే కనపడుతోందని కొందరు చర్చించుకుంటున్నారు…