టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే..పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు

Congress MLA into TRS

0
86

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ .. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఫైర్ అయ్యారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు టిఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయం అంటూ పుట్ట మధు పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్ గేటు తెరవడం లేదన్నారు. కాగా 2018 ఎన్నికల్లో పుట్టమధుపై కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన శ్రీధర్ బాబు విజయం సాధించిన సంగతి తెలిసిందే.