మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావడంలేదో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈటల గురించి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈటల బిజెపి వైపు చూడడానికి కారణాలను జగ్గారెడ్డి వివరించారు.
మా దగ్గర హోం శాఖ లేదు కదా? అందుకే ఆయన బిజెపి పోతున్నడు. అదే మా దగ్గర హోం శాఖ ఉంటే మ పార్టీ లో చేరే వాడే. ఈటెలకు ఢిల్లీ హోం… ఇన్ కాం… Ed లు అవసరం అని ఎద్దేవా చేశారు. ఈటల మీద రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. ఈటెలకు ఢిల్లీ పోలీసుల అవసరం ఉంది.. అన్నారు. ఈటల నిజంగా కేసిఆర్ పై పోరాటం చేయాలని అనుకుంటే కాంగ్రెస్ దగ్గరికి వచ్చేవాడేనని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ బలమైంది… ఈటెల బలహీనుడు అని విమర్శించారు జగ్గారెడ్డి.