Breaking: కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి? రేపు కీలక ప్రకటన చేసే ఛాన్స్

0
76

సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం, పార్టీ అధిష్టానం. పార్టీ ముఖ్య నేతల తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తుంది. ఈ మధ్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలవడంతో పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే రేపు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యి అనంతరం భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరుతారో అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ బీజీపీలో చేరితే మళ్లీ బై ఎలెక్షన్స్ లో జగ్గారెడ్డి గెలుపు ఖాయమే. అయితే తరచూ తెరాస అధినేత కేసీఆర్ కు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే జగ్గారెడ్డి కారు ఎక్కబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.