Big News: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన కామెంట్స్

0
82

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘‘మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి. కేసీఆర్‌ భావిస్తే ఉపఎన్నిక రాదు. ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని సంచలన కామెంట్స్ చేశారు.

రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తాం. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా అని తెలిపారు. అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​కే పరిమితం చేశారన్న రాజగోపాల్​రెడ్డి.. కేసీఆర్​కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు.

కాగా ఇవాళ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ వేర్వేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.  అయినా కానీ ఆయన అభిప్రాయం మారేలా కనిపించడం లేదు. కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.