కాంగ్రెస్‌కు రేపు నూతన అధ్యక్షుడు..!

కాంగ్రెస్‌కు రేపు నూతన అధ్యక్షుడు..!

0
92

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అని వార్యమైంది. అయితే కాంగ్రెస్‌కు కొత్త సారథి రాబోతున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశంలోనే అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి నూతన అధ్యక్షుడిని తప్పకుండా ఎన్నుకుంటామని, ఇక ఆలస్యమయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ ఈరోజు మీడియాతో అన్నారు. నాకున్న సమాచారం మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వచ్చేంత వరకూ చర్చలు జరుగుతాయి. ఆ వెంటనే అంతర్గతంగా ఎన్నిక చేపడతాంగ అని సింఘ్వీ తెలిపారు. ఇదిలా ఉండగా.. రేపు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో తాత్కాలిక చీఫ్‌ను ఎన్నుకుని, కొత్త అధ్యక్షుడి ఎంపికకు ప్యానెల్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.