కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణమైన స్దితిలొ ఉంది.. ఇక తెలంగాణలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే కచ్చితంగా అక్కడ స్టార్ డమ్ ఉన్న పొలిటికల్ లీడర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని చూస్తున్నారు.
అయితే ఇఫ్పుడు సైరాతో మంచి సక్సస్ మీద ఉన్న చిరుతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ మంతనాలు మొదలు పెట్టింది అంటున్నారు. ఆయన తాజాగా మరో సినిమా సెట్స్ పైకి పెడతున్నారు ఈ సమయంలో ఏపీలో బాధ్యతలు చిరంజీవికి ఇస్తే బెటర్ అని కొందరు అన్నారట.
కాని చిరు మాత్రం మొత్తం రాజకీయాలకు దూరం అయ్యారు అంటున్నారు.. అయితే కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా, పార్టీలో కొనసాగుతున్నారు.
ఈ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఎక్కడ పార్టీ కోసం ప్రచారం చేయలేదు.. దీంతో ఆయన ఏపీలో కూడా పగ్గాలు తీసుకోరు అని అంటున్నారు.. అందుకే సీనియర్లు కూడా ఆయనతో చర్చలు జరపడం లేదట.. కాని హస్తిన వర్గాలు మాత్రం ఆయనతో చర్చించాలి అని భావించాయట.