Flash: నైట్ పబ్ లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత..వివాదంగా మారిన వీడియో

0
85

ప్రస్తుతం ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఓ వివాదంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాడు. అంతేకాకుండా ఈ విషయంపై  బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీపై  తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..నేపాల్‌లోని ఓ పబ్‌ లో రాహుల్ గాంధీ, బిజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా కలిసి ఎంజాయ్‌ చేస్తున్న వీడియో బయటకు రావడం అందరిని షాక్ కు గురిచేసింది.

కానీ ఆ వీడియో ఎప్పటిది అనే విషయంపై  మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వీడియో ఆయన సన్నిహిత వర్గాలే విడుదల చేశాయని వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. చైనా వ్యక్తితో రాహుల్‌ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసి బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు