కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చట్ట సభల్లో ప్రవేశించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… త్వరలో ఆమెను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది… పార్టీకి చెందిన మోతిలాల్ మదుసుదన్ మిస్త్రీ, దిగ్విజయ్ జింగ్ వంటి కీలక నేతల పదవి కాలం ఈ సంవత్సరం పూర్తి కానుంది…
ఇందులో కొంతమంది తిరిగి రీప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి… అయితే ఈ సారి ప్రియాంకా గాంధీతో పాటు మరికొందరిని పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తోంది…
మహరాష్ట్ర మధ్య ప్రదేశ్ ఛత్తీస్ గడ్ ఏదో ఒక ప్రదేశం నుంచి చట్ట సభకు పంపవచ్చని భావిస్తున్నారు… సభలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే నాయకులను ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోందట… అందుకే ఈ సారి ప్రియాంకా గాంధీని రాజ్యసభకు పంపాలని చూస్తున్నారట…