కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రగతి భవన్ వద్ద శనివారం హల్ చల్ చేశారు. ముఖ్యమంత్రికి తాను రాసిన ఒక లేఖను తీసుకుని ప్రగతిభవన్ వద్దకు వచ్చారు. సిఎంకు లేఖ ఇచ్చేందుకు తనను లోపలికి పోనియ్యాలని పోలీసులను కోరారు.
ఆయన ప్రగతి భవన్ వరకు వచ్చిన విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. విహెచ్ ఎందుకోసం వచ్చారని ఉన్నతాధికారులు సెట్ లో ఆరా తీశారు.
అయితే కరోనాతో చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరేందుకు వచ్చానని విహెచ్ బదులిచ్చారు. పక్క రాష్ట్రాల్లో సాయం చేస్తున్నా తెలంగాణలో చేయడంలేదని ఈ విషయాన్ని సిఎంకు తెలియజేస్తానని అన్నారు.
ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని అన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సిఎం అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని ఆరోపించారు. తాను ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు.
అయితే కొద్దిసేపటి తర్వాత విహెచ్ కు ప్రగతిభవన్ లోపలికి వెళ్లేందుకు అనుమతి రాలేదు. తాను రాసిన లేఖను పోలీసు సిబ్బందికి అందజేసి విహెచ్ అక్కడినుంచి నిష్క్రమించారు.
విహెచ్ ప్రగతి భవన్ వద్దకు వచ్చిన వీడియోల లింక్స్ కింద ఉన్నాయి చూడొచ్చు…
https://www.facebook.com/watch/?v=992608348213314
https://www.facebook.com/watch/?v=320011682987295