తెలంగాణ సిఎం కేసిఆర్ కు థాంక్స్ చెప్పేశారు

0
97

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ దిశ గా‌ సీఎం కేసీఆర్  చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఇవాళ బీఆర్కే భవన్ లో తనను కలిసిన  జూనియర్ , డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చర్ల జేఎసీ నేతలకు బేసిక్ పే అమలు‌  కు సంబంధించిన 104, 105, 106 జీవో కాపీలను మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఛైర్మన్ కనక చంద్రం , సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ మరియు రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు వినోద్ కుమార్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు ఉమ శంకర్ , రాష్ట్ర నాయకులు సదానందం, త్రి భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.