Breaking- కరోనా కలకలం..10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

Corona agitation..10 ministers, 20 MLAs positive

0
73

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలోనూ విశ్వరూపం చూపిస్తోంది ఈ మహమ్మారి. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. ఇందులో ప్రజా ప్రతినిధుల కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20మంది ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటన చేశారు. అయితే, మంత్రులు,ఎమ్మెల్యేలలో ఎవరికి కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు.