క‌రోనా అల‌ర్ట్ – ముస్లిం పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

క‌రోనా అల‌ర్ట్ - ముస్లిం పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

0
78

రంజాన్ మాసం ప్రారంభం అయింది… కాని ఈ క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇంట్లోనే ప్రార్ధ‌న‌లు చే‌సుకోవాలి అని ప్ర‌భుత్వాలు కూడా ముస్లింల‌కు తెలియ‌చేశాయి, అయితే ఈ స‌మ‌యంలో కొంద‌రు కోవిడ్ సోకిన వారు ఆస్ప‌త్రిలో ఉంటున్నారు… మ‌రికొంద‌రు అనుమానంతో ఐసోలేష‌న్ క్వారంటైన్ లో ఉన్నారు ఈ స‌మ‌యంలో ..

ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ మెనూ అమల్లోకి రానుంది. తెలంగాణ స‌ర్కార్ తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుని వెల్ల‌డించింది.

క్వారంటైన్లలో ఉండే ముస్లింలు తెల్లవారుజామున ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు. సాయంత్రం ఉపవాస దీక్ష త‌ర్వాత‌ ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అంతేకాదు అల్పాహ‌రంగా ఖ‌ర్జూరం అర‌టి పండ్లు అందిస్తారు. అంతేకాకుండా రోజు విడిచి రోజు చికెన్ క‌ర్రీ లేదా మ‌ట‌న్ క‌ర్రీ అందిస్తారు
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్లిమేతరులను మరొక గదిలోకి తరలించనున్నట్టు తెలుస్తోంది. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.