కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది.. దాదాపు 206 దేశాలకు ఈ వైరస్ పాకేసింది.. అయితే మన దేశంలో రోడ్లపైకి రావద్దు అని పోలీసులు చెబుతున్నారు.. వారు లాఠీలకు పని చెబుతుంటే వారిని విమర్శిస్తున్నారు, అయితే మనదేశంలో కొందరు పోలీసులని కూడా తిరిగి కొడుతున్నారు.
కాని ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే చాలా దేశాలలో ఇలా కర్ఫూ లేదా లాక్ డౌన్ ని అతిక్రమించినా అక్కడ చట్టాలు అతిక్రమించినా కఠిన శిక్షలు విధిస్తారు. తాజాగా కరోనా వ్యాప్తి చెందేలా చేసిన వ్యక్తికి సౌదీలో మరణ శిక్ష విధిస్తున్నారు.
సదరు వ్యక్తి ఇటీవల.. సూపర్ మార్కెట్లలోని షాపింగ్ ట్రాలీలపై ఉమ్మి వేస్తూ అధికారులకు దొరికిపోయాడు. హెయిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నేరం రుజువైతే అతడికి మరణ శిక్ష విధించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వ్యాఖ్యానించినట్టు , ఇలా సమాజానికి చేటు చేయాలనే వారిని ఉపేక్షించం అంటున్నారు.