కరోనా వ్యాధి విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడూ దీని గురించి పూర్తి సమాచారం అందిస్తోంది, ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతోంది..కాని కొందరు ఆకతాయిలుచేసే పనులు మాత్రం ప్రభుత్వ పనులకి ఆటంకం కలిగిస్తున్నాయి.
కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వాలంటూ, అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ తో ఆడుకున్న ఓ వ్యక్తికి ఆ ప్రాంత కలెక్టర్ శిక్షను విధించారు ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో కరోనా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి, తనకు నాలుగు సమోసాలు కావాలని కోరాడు.
అధికారులు ఎంత చెప్పినా వినకుండా, పదే పదే ఫోన్ చేసి సమోసాలు అడుగుతూనే ఉన్నాడు. దీంతో విషయం తెలుసుకున్న రాంపూర్ జిల్లా కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్, అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పోలీసులు పట్టుకుని కలెక్టర్ ముందుకు తీసుకువచ్చారు, అతనికి నాలుగు సమోసాలు అందించి మరుగుదొడ్లను శుభ్రం చేయాలంటూ, సామాజిక శిక్షను విధించారు. తిక్క కుదిరింది అని గ్రామస్తులు నెటిజన్లు అన్నారు, నాలుగు సమోసాలు తీసుకుని చివరకు కలెక్టర్ చెప్పిన పని మూడు గంటలు చేశాడు.