ఈ జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులు కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవచ్చు… కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

ఈ జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులు కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవచ్చు... కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

0
94

కరోనా మృతదేహాల వల్ల అదనపు ముప్పేమీ రాదని కాటికాపరులకు చెప్పాలి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్ని పాటించేలా చూడాలి… మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు వచ్చిన కుటుటంబ సభ్యులు బంధువులు శ్రేయోభిలాషులకు దూరం నుంచి చూడడానికి అనుమతించవచ్చు… భౌతికకాయాన్ని చూసేందకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులను అనుమతించకూడదు.. కేవలం దగ్గరి బంధువులు ముఖ్యమైన వారినే అనుమతించాలి…

భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎవరు ముట్టుకోకుండా వారి కుటుంబ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలన్ని కొనసాగించవచ్చు… ఏదైనా స్క్రిఫ్ట్ చదవడం పవిత్ర జలం చల్లడం లాంటి మతపరమైన క్రతువులను భౌతికాయం దగ్గర కాకుండా దూరం నుంచి చేసుకోవాలి.. మృతదేహానికి చివరి సారిగా స్నానం చేయించడం తాకడం ముద్దు పెట్టుకోవడం కౌగిలించుకునేందుకు ప్రయత్నించడం లాంటివి చేయకూడదు…

మృత దేహం దహనం ఖననం తర్వాత కాటికాపరులు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల ఇతర ఆరోగ్య సిబ్బంది చేతులు శుభ్రంగా కడుక్కోవాలి… మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చే బూడిద నుంచి ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావు వారి కుటుంబ ఆచారం ప్రకారం అంతిమ క్రతువు కోసం బూడిదను సేకరించుకోవచ్చు… చనిపోయిన వారి సమీప కుటుంబ సభ్యుల నుంచి మిగతావారు సాధ్యమైనంతవరకు భౌతిక దూరం పాటిచడం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్తపడాలి…