మానవత్వాన్ని మరిచి కరోనా మృతదేహం విషయంలో ఎలా ప్రవర్తించారో చూడండి….

మానవత్వాన్ని మరిచి కరోనా మృతదేహం విషయంలో ఎలా ప్రవర్తించారో చూడండి....

0
95

దేశంలో కరోనా మృత్య ఘంటికలు మోగుతున్న వేళ ప్రజలకు భయం వెంటాడుతోంది… కరోనాతో ఎవరైనా మరణించారణి తెలిస్తే అటువైపు అడుగువేయడానికి ప్రజలు వణికిపోతున్నారు… అంత్యక్రియలు ఆ నలుగురు కూడా దొరకని దారుణమైన పరిస్థితి తాజాగా నెలకొంటోంది… కుటుంబసభ్యులు దగ్గరి బంధువులు మరణించినా అనుమానంగా చూసే దుస్తితి నెలకొంది…

ఇక ఆ మరణించిన వారు కరోనా మహమ్మారి వల్ల చనిపోయారని తెలిస్తే ఇక గుండెల్లో దడే… ఇలాంటి పరిస్థితిల్లో ప్రజల్లో నెలకొన్న భయాలను తరిమి కొట్టాలని కోవిడ్ 19 తో మరణించిన వారి అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరిగేలా చూడాలని కోర్టులు ఆదేశిస్తున్నాయి… అయినప్పటికీ అధికారలు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి… కనీసం మానవత్వం లేకుండా మృతదేహాలను విసిరేస్తున్నారు… ఇలాంటి సంఘటనే తిరుపతిలో జరిగింది…

నగరంలోని ఓ కూరగాయల మర్కెట్ లో పనిచేసిన వ్యక్తికి కరోనా సోకింది… గత కొద్దిరోజులు స్విమ్స్ లో చికిత్స తీసుకున్నాడు… అయితే వయస్సుతో పాటు దాదాపు 150 కిలోలు బరువు ఉండటంతో స్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు… వైద్యుల ప్రయత్నాలు ప్రయత్నించకపోవడంతో అతడు మృతి చెందాడు… మృత దేహాన్ని ఆంబులెన్స్ లో తీసుకువచ్చారు అయితే మృత దేహం 150 కేజీల బరువు ఉందని నేపంతో ఆంబులెన్స్ నుంచి జేసీబీతో బయటకు తీసి గోతిలో వేసి పూడ్చి పెట్టారు… ఈ సంఘటనలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి…