కరోనా అమెరికాపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. అక్కడ ట్రిలియన్ల డాలర్ల ఆర్దిక వ్యవస్ధ ఇప్పుడు అగాతంలో పడిపోయింది, ఇక ఈ దెబ్బతో సాఫ్ట్ వేర్ మార్కెట్ కూడా కొద్ది రోజులు ఒడిదుడుకులు ఎదురుకోవాల్సిందే అంటున్నారు, ఇక హోటల్స్ టూరిజం రంగాలు అతి దారుణంగా నాశనం అయ్యాయి.
ఈ వైరస్ దెబ్బతోప్రపంచంలోని అనేక మంది అపర కుబేరులు సంపద ఆవిరైపోయింది. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కూడా భారీగా లాస్ వచ్చింది,ఆయన అమెరికాలో వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే,,
కరోనా దెబ్బతో షాపింగ్ మాల్స్, హోటళ్లు మూతపడటంతో ట్రంప్ సంపదలో దాదాపు ఒక బిలియన డాలర్లు దాదాపు 7500 కోట్లు తుడిచి పెట్టుకుపోయాయని తెలుస్తోంది. మార్చి 1 నాటికి ట్రంప్ దగ్గర ఉన్న సంపద విలువ 3.1 బిలియన్ డాలర్లు . మార్చి 18 కల్లా ఆ విలువ 2.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆయనకు వచ్చే ప్రధాన ఆదాయం హోటల్స్ గోల్ఫ్ అన్నీ క్లోజ్ అయ్యాయి అనేది తెలిసిందే.