ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది కరోనా వైరస్, ఈ వైరస్ కారణంగా చాలా మంది బయటకు రావడం లేదు.. దాదాపు ప్రపంచం షట్ డౌన్ అయింది అనే చెప్పాలి, ఏకంగా 192 దేశాలు ఈ వైరస్ భారిన పడ్డాయి, అయితే ఈ వైరస్ గురించి వార్తలు కూడా అలాగే వినిపిస్తున్నాయి.
అసలు ఎలా సోకుతుంది అనేదానిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, తాజాగా దీనిపై ఊహగానాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. చికెన్ తినడం వల్ల వైరస్ రాదు, మటన్ చేపలు తినడం వల్ల ఈ వైరస్ సోకదు, అలాగే, గాలి ద్వారా, పేపర్ల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని వివరణ ఇచ్చింది కేంద్రం.
ఇక దోమలు వల్ల కూడా వైరస్ రాదు అని తెలిపింది, . అలాగే, వెల్లుల్లి తినడం వల్ల, ఆల్కహల్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చన్న విషయంలో శాస్త్రీయత లేదని స్పష్టం చేసింది. ఈ వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది… తుమ్మినా దగ్గినా మో చేయి అడ్డుపెట్టుకోవాలి అని తెలిపింది.