క‌రోనా ఎఫెక్ట్ క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకులు గుడ్ న్యూస్

క‌రోనా ఎఫెక్ట్ క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకులు గుడ్ న్యూస్

0
133

క‌రోనా వైర‌స్ వ‌ల్ల అతి దారుణ‌మైన ప‌రిస్దితి వచ్చింది…. ఆర్దిక వ్య‌వ‌స్ధ చిన్నా భిన్నం అయింది, ఈ స‌మ‌యంలో ఎవ‌రికి పనిలేదు… ఉపాధిలేక అంద‌రూ ఇంటిలోనే ఉన్నారు.. చిరు ఉద్యోగులు కూడా ఇళ్లకే ప‌రిమితం అయ్యారు, దీంతో బ‌తుకు క‌ష్టంగా మారింది.

ఈ స‌మ‌యంలో కేంద్రం నుంచి వారికి రేష‌న్ 500… న‌గ‌దు మూడు నెల‌లు అందిస్తాం అని తెలిపింది, అంతేకాదు ఆర్బీఐ బ్యాంకు ఖాతాదారుల‌కు వారు చెల్లించే ఈ ఎంఐ పై మూడు నెల‌లు మారిటోరియం విధించింది.

కొన్ని బ్యాంకులు వారి కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం సదుపాయం కల్పించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. మూడు నెలలు ఈఎంఐలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఎస్ .బీ .ఐ దారిలో కెనరా బ్యాంక్ కూడా నడిచింది.

అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు ఐడీబీఐ బ్యాంక్ కూడా అవ‌కాశం ఇచ్చింది. అలాగే సిండికేట్ బ్యాంక్ కూడా హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్ సహా ఇతర టర్మ్ లోన్స్‌పై మారటోరియం విధించింది. ఇండియన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఈ అవ‌కాశం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వంటివి ఈ అవ‌కాశం క‌ల్పించాయి. ఇది క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.